'ఇక పాలమూరు, రంగారెడ్డి ఎడారే'

by Shyam |   ( Updated:2020-05-12 07:30:03.0  )
ఇక పాలమూరు, రంగారెడ్డి ఎడారే
X

దిశ, రంగారెడ్డి: సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జలాల దోపిడీ విషయంలో ఏపీ సీఎం జగన్ తో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసుకున్న చీకటి ఒప్పందముతో పాలమూరు-రంగారెడ్డి ఎడారి కానుందని విమర్శించారు. గుడిని మింగే వారు ఒకరైతే గుడిలో లింగాన్ని మింగేవారు మరొకరు అన్నట్టుగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. జలాల దోపిడీలో తండ్రిని మించిన తనయుడిగా జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా 40 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తే ఆయన తనయుడు 80 వేల క్యూసెక్కుల నీటిని తీసుకువేళ్లేందుకు జీవో తెచ్చారని, అలా అయితే పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఎడారి కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత పాలనతో జలాలు దోపిడీకి గురవుతున్నాయని మండిపడ్డారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. లక్ష్మీదేవుని పల్లి ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభించలేదన్నారు. జల దోపిడీకి నిరసనగా బుధవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరి గృహంలో వారు నిరసన దీక్ష విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed