- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పూంచ్ సెక్టార్‌పై పాక్ కాల్పులు
దిశ, వెబ్ డెస్క్ :ఇండియా చేతిలో ఎన్నిమార్లు దెబ్బతిన్న పాక్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. టెర్రరిస్టుల భారత్ లోకి పంపంచి ఇక్కడ విధ్వంసానికి పాల్పడటం దానికి కొత్తేమీ కాదు. తాజాగా నియంత్రణ రేఖ (line of control) వెంబడి దాయాది పాక్ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా షాపూర్, కిర్ని, కృష్ణ ఘటి సెక్టార్లలో కాల్పులకు తెగబడింది. తేలికపాటి ఆయుధాలు, మోర్టార్లతో దాడులు చేసింది. ఆదివారం సాయంత్రం కాల్పులకు తెగబడ్డట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
వెంటనే అప్రమత్తమైన భారత సరిహద్దు బలగాలు పాక్ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఉదయం కూడా LAC వెంబడి మాన్‌కోతే సెక్టార్‌పై మోర్టార్ షెల్స్, తేలికపాటి ఆయుధాలతో పాక్ బలగాలు కాల్పులు జరపగా, భారత్ జవాన్లు ఎదురుదాడికి దిగి వాటిని తిప్పికొట్టాయి.