- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ షాక్స్… భారత్ రాక్స్..!
దిశ, వెబ్‌డెస్క్: పాక్ మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేసింది. భారత్ ఓవైపు చైనాతో సరిహద్దు ఆందోళనలను ఎదుర్కొంటున్న వేళ… మన దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించేందుకు పాక్ పరోక్షంగా సాయం చేస్తోంది. కానీ, భారత ఆర్మీ ఆ ప్రయత్నాలను తిప్పి కొట్టింది.
జమూ-కశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో పాక్‌కు చెందిన డ్రోన్‌ను భారత సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) శనివారం కూల్చేసింది. శీతాకాలంలో ఈ ప్రాంతమంతా పూర్తిగా మంచు కురుస్తుంది. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులను సరిహద్దు దాటించేందుకు చూస్తున్నారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ డ్రోన్‌ను చైనాకు చెందిన డీజేఐ తయారు చేసినట్టు, దీనిపేరు మావిక్-2 ప్రోగా అధికారులు పేర్కొన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు డ్రోన్‌ల ద్వారా సహాయం చేస్తోంది. ఆయుధాలను వాటి ద్వారా సరఫరా చేస్తోంది. కానీ, మన ఆర్మీ వాటి కదలికలను డ్రోన్‌ల సహకారంతోనే కనిపెడుతోంది. ఈ క్రమంలోనే పాక్‌కు చెందిన డ్రోన్‌లను ఆర్మీ కూల్చేసింది. ఈ వ్యవహారంపై నెటిజెన్లు స్పందిస్తూ “పాక్ షాక్స్… భారత్ రాక్స్” అని కామెంట్స్ చేస్తున్నారు.