భారత అధికారికి పాక్ సమన్లు 

దిశ, వెబ్ డెస్క్: భారత సీనియర్ దౌత్య అధికారికి పాకిస్తాన్ సమన్లు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందంటూ పేర్కొంది. ఈ మేరకు ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ దౌత్య అధికారికి సోమవారం సమన్లు జారీ చేసింది పాకిస్తాన్.

ఆదివారం రాత్రి LOC దగ్గర భారత్ సైన్యం జరిపిన కాల్పుల్లో తమ దేశ పౌరులు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారంటూ పాక్ పేర్కొంది. ఈ ఏడాది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ 2,245 సార్లు దాడులకు పాల్పడ్డారని, ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా, 180 మంది గాయపడ్డారని దాయాది దేశం ఆరోపించింది.

ఇకమీదట భారత సైన్యం LOC వెంట గానీ, వర్కింగ్ బౌండరీ వెంటగానీ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లఘించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. 2003 కాల్పుల ఒప్పందాన్ని గౌరవించాలని, శాంతిని కాపాడాలని శాంతివచనాలు పలికింది పాకిస్తాన్.

Advertisement