భారత బలగాలపై పాకిస్తాన్ కాల్పులు

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత బలగాలపై కాల్పులు జరిపింది. జమ్ముకాశ్మీర్‌లోని పూంజ్ జిల్లాలోని షాపూర్, కిర్ణి, డేగ్వార్ సెక్టార్లలో శనివారం పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన భారత బలగాలు పాకిస్తాన్ కాల్పులను తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాగా దాయాది దేశం ఇలాంటి చర్యలకు పాల్పడటం మూలంగా భారత ఆర్మీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.

Advertisement