ఉగ్రవాదుల విధానాన్ని కొవిడ్ 19కి వాడుతున్న పాక్

by vinod kumar |
ఉగ్రవాదుల విధానాన్ని కొవిడ్ 19కి వాడుతున్న పాక్
X

దిశ, వెబ్‌డెస్క్: టెర్రరిస్టులను కనిపెట్టడానికి ఉపయోగించే టెక్నాలజీని కొవిడ్19 వ్యాధిగ్రస్తులను ట్రాక్ చేయడానికి తమ దేశం ఉపయోగిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. నిఘా ఏజెన్సీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఇప్పటివరకు ఈ టెక్నాలజీ ద్వారా పాకిస్తాన్ వ్యాప్తంగా కరోనా అనుమానితులను కనిపెట్టినట్లు చెప్పారు.

కరోనా మహమ్మారి వల్ల దారుణంగా ప్రభావితమై రోడ్డున పడిన వారి కోసం విరాళాలు సేకరించే ఉద్దేశంతో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరోనా కట్టడికి దేశం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని, అనుమానితులను గుర్తించడానికి ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సాయం చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. తమ పాలక వర్గం లేని సింధ్ ప్రావిన్స్‌లో ప్రజలకు కూడా అందరికీ డబ్బు సాయం అందినట్లు తెలిపారు. ఇప్పటివరకు పాకిస్తాన్‌లో కరోనా పేషెంట్ల సంఖ్య 10,982కి చేరుకున్న సంగతి తెలిసిందే.

Tags – corona, covid, international, pakistan, tracking, isi tech, terrorists

Advertisement

Next Story

Most Viewed