- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చిన్నతనం నుంచే పాటలు, నాటికలు..!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ :
శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో పనిచేసే జి.వి.సుబ్రహ్మణ్యం అనే మాస్టారు బాలుతో ‘చెంచులక్ష్మి’ సినిమాలో సుశీల ఆలపించిన ‘పాలకడలిపై శేషతల్పమున’ అనే పాటను బాలుతో పాడించి టేప్ మీద రికార్డు చేయించారు. ఆనాడు బాలుకు అదొక మధురానుభూతి. మరో మాష్టారు రాధాపతి ప్రోత్సాహంతో ‘ఈ ఇల్లు అమ్మబడును’, ‘ఆత్మహత్య’ వంటి నాటికల్లో నటించి ప్రేక్షకుల మన్నన పొందారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకంలో స్త్రీ పాత్ర ధరించే అవకాశం వచ్చింది. తర్వాత విజయవాడ ఆకాశవాణిలో తాను స్వయంగా రాసి, బాణీ కట్టి ఆలపించిన ఒక లలిత గీతానికి బహుమతి లభించింది.
Next Story