- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్కిటిక్ మీద ఓజోన్ పొరకు రంధ్రం
దిశ, వెబ్‌డెస్క్:
గత 25 ఏళ్లుగా అంటార్కిటికా మీద పెద్ద ఓజోన్ రంధ్రం ఉందని, దానికి కారణం గ్లోబల్ వార్మింగ్ అని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అయితే కొత్తగా ఆర్కిటిక్ మీద ఓజన్ పొరకు రంధ్రం పడినట్లు ఉపగ్రహాలు కనిపెట్టాయి. అయితే ఆర్కిటిక్ మీద ఓజోన్ రంధ్రం ఏర్పడటం గురించి శాస్త్రవేత్తలు ఒకింత ఆశ్చర్యపోతున్నారు.
సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి ఓజోన్ పొర మానవాళిని రక్షిస్తోంది. పెరుగుతున్న కాలుష్యం, తద్వారా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ పొరకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. దీంతో సరాసరి అతినీలలోహిత కిరణాలు భూమ్మీద ప్రసరించి చేటు కలిగిస్తోంది. అలాగే వేడి కారణంగా మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి లోతట్టు దేశాలు మునిగిపోయే ప్రమాదముంది. అయితే ఆర్కిటిక్ మీద ఏర్పడిన ఓజోన్ రంధ్రం పరిమాణం కాలాలను బట్టి మారుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మార్చి 14న ఆర్కిటిక్ ప్రాంతం మీదుగా ఓజోన్ స్థాయులు దారుణంగా పడిపోవడానికి జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ గుర్తించింది. ఆ ప్రాంతంలో మరింత ఫోకస్ చేసి చూడగా ఓజోన్ రంధ్రం ఉన్నట్లు తెలిసింది. ఈఎస్ఏ వారి కోపర్నికస్ సెంటినల్ 5పీ శాటిలైట్లో ఉన్న ట్రోపోమీ పరికరం ద్వారా ఈ రంధ్రాన్ని గుర్తించగలిగారు. ఈ రంధ్రం గరిష్టంగా దాదాపు 10 లక్షల కి.మీ స్క్వేర్ వరకు వ్యాపించి ఉందని, అయితే అంటార్కిటికా మీద ఏర్పడిన రంధ్రంతో పోల్చి చూస్తే ఇది తక్కువేనని జర్మన్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
Tags: Ozone layer, Ozone hole, Ozone, Antarctic, Arctic, Copernicus