- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్సిజన్‌తో ఆయువు నిలుపుతాము.. మాజీ ఎంపీ కొండా
దిశ, వికారాబాద్ : కరోనా మహమ్మారి ఆయువు తీయాలని చూస్తే.. తాము ఆక్సిజన్ సరఫరా చేసి ఆయువు నిలుపుతామని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొవిడ్ బాధితలకు భరోసా కల్పించారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రం పరిధిలోని శ్రీ సాయి డెంటల్ కళాశాల ఆవరణలో జస్టిస్ కొండ మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటేషన్ యంత్రాలను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి సోకితే ఆక్సిజన్ అందకుండా వ్యక్తిపై దాడి చేసి ప్రాణాలను హరిస్తుందని అన్నారు.
కరోనా బాధితులకు ఆక్సిజన్ అందాలి అంటేనే ఆకాశం అంత ఎత్తులో ఆక్సిజన్ ధరలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుపేద కొవిడ్ బాధితుల కోసమే ఉచితంగా ఆక్సిజన్ అందించి ప్రాణాలను నిలపాలనే లక్ష్యంతో జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ కృషి చేస్తుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం కంటే కొవిడ్ బాధితులు పది రెట్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ నిరుద్యోగ యువతకు ఎన్-95 కంటే సురక్షితమైన, ప్రత్యేమైన మాస్కుల తయారీలో శిక్షణ ఇచ్చామని వివరించారు. మా శారదా ఆసుపత్రిలో తర్ఫీదు పొందిన వైద్య సిబ్బందిచే ఆక్సిజన్ అందిస్తామని అన్నారు. ఇందులో భాగంగా జెకెఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్మనీ దేశం నుండి 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటేషన్ యంత్రాలను తెప్పించామని పేర్కొన్నారు. ఇందులో 13 ఆక్సిజన్ కాన్సన్ట్రేటేషన్ యంత్రాలు మా శారదా ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. చైనా సరఫరా చేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటేషన్ కంటే 99.99 శాతం ఉత్తమమైనవని అన్నారు. ఈ సందర్భంగా కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు.