- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశీయ తొలి వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా నుంచి వచ్చే అవకాశం!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు దేశీయంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులో రానుందని ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సహాకారంతో బ్రిటీష్ సంస్థ ఆస్ట్రాజెనెకా రూపోందిస్తున్న వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ జరుపుతోంది. ఇది పూర్తయితే డిసెంబర్ నాటికి అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. దీని తయారీ కోసం దేశీయ అతిపెద్ద టీకా సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ అనుమతులను పొందిన సంగతి తెలిసిందే.
అలాగే, దేశీ కంపెనీలైన జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయి. భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకునే స్థాయిలో ఉంది. జైడస్ క్యాడిలాకు చెనిదిన జైకోవ్-డీ తొలిదశ పరీక్షల్లో ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు 1600 మందిపై నిర్వహించినట్టు సమాచారం.
అంతేకాకుండా, ఏంపిక చేసిన 17 ప్రాంతాల్లో 18 ఏళ్లు దాటిన వారిపై రెండు, మూడు దశల ప్రయోగాలు చేసినట్టు తెలుస్తోంది. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నెలకు 10 కోట్ల మోతాదులను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ నిమిత్తం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సుమారు రూ. 1,100 కోట్ల నిధులను అందించింది.