- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అడుగడుగునా నిర్లక్ష్యం.. విద్యుత్ షాక్‌తో 8 పశువులు మృత్యువాత
by Sumithra |

X
దిశ, మహబూబూబాద్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఎనిమిది పశువులను బలిగొన్నది. మహబూబూబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలంలోని వసురాం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు ఎద్దులు, ఒక ఆవు కరెంట్ షాక్‌తో మృత్యువాత పడ్డాయి.
వివరాల్లోకి వెళితే.. గుగులోత్ రవి, గుగులోత్ బాలు, గుగులోత్ శంకర్, గుగులోత్ లచ్చు, గుగులోత్ కిషన్, గుగులోత్ వీరన్న, గుగులోత్ వెంకట్ రావులకు చెందిన ఏడు ఎద్దులు, ఒక ఆవు పశుగ్రాసానికి వెళ్లగా తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన పశువుల విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.
Next Story