మందు కొంటే మాస్కు ఫ్రీ…

by Anukaran |   ( Updated:23 July 2020 7:09 AM  )
మందు కొంటే మాస్కు ఫ్రీ…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:

ఆషాడం స్పెషల్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటూ ప్రకటనల ప్రపంచంలో జీవనం సాగించాల్సిన సగటు మానవునికి ఈ సారి కరోనా వ్యాధి బ్రేకేసింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోడం చేసుకునేందుకు ఈ వ్యాపారులు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. శ్రావణ మాసంలో చాలా మంది మందు, మాంసం జోలికి వెల్లకుండా ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో వినియోగదాులను ఆకర్షించుకునేందుకు ఓ మద్యం దుకాణదారు ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించేశారు. మద్యం బాటిల్ కొంటే మాస్కు ఫ్రీ అన్న నినాదంతో మందుబాబులను ఆకర్షించే పనిలోపడ్డారు. కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన లక్కీ వైన్ షాప్ యజమాని కాస్తా డిఫరెంట్‌గా ఆలోచించి బ్యానర్ కూడా కట్టేశారు. కరోనా కష్ట కాలంలో మాస్కు లేకుండా బయటకు రాలేకపోతున్న వారిని కూడా ఆకర్షించేందుకు వినూత్నంగా ఈ ఆఫర్ ప్రకటించారు. ఒక ఫుల్ బాటిల్ కొంటే మాస్కు ఫ్రీ, రెండు బాటిళ్లు కొంటే ఒక ఫేష్ షీల్డ్ ప్రొటెక్టివ్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆయన చేసిన ఈ వినూత్న ప్రయోగం ద్వారా లిక్కర్ అమ్మకాలు పెరిగాయో లేదో కాని ఈ వైన్ షాపు గురించి మాత్రం సర్వత్రా చర్చ జరుగుతోంది.

Next Story