టాస్క్‌ఫోర్సు రెస్క్యూ ఆపరేషన్.. 15 గుడ్ల గూబలు సేఫ్

by Sumithra |
టాస్క్‌ఫోర్సు రెస్క్యూ ఆపరేషన్.. 15 గుడ్ల గూబలు సేఫ్
X

దిశ, క్రైమ్‌బ్యూరో : అడవులకు వేటకెళ్లి అక్రమంగా గుడ్ల గూబలను పట్టుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఫలక్ నూమా ప్రాంతానికి చెందిన కమ్రాన్ అలీ ఫరూఖుల్ అలియాస్ ఇమ్రాన్ అలీ గత 5 సంవత్సరాలుగా శ్రీశైలం అడవుల నుంచి పక్షులను తీసుకొచ్చి నగరంలోని అవసరమైన వారికి ముర్గీ చౌక్, హుస్సేనీ ఆలం ప్రాంతాల వద్ద విక్రయిస్తున్నాడు.

మూఢ నమ్మకాలకు అధికంగా వినియోగించే గుడ్లగూడ పక్షికి ఒక్కో దానికి రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకూ డిమాండ్ ఉంది. దీంతో నగరంలోని అవసరమైన వ్యక్తులకు ప్రతిరోజూ శ్రీశైలం అడవులకు వెళ్లి తీసుకొస్తూ గుడ్లగూబ పక్షులను విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ బుధవారం ఇమ్రాన్ అలీని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. తదుపరి దర్యాప్తునకు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తులో పాల్గొన్న ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, చంద్రమోహన్, నరేందర్ ఇతర సిబ్బంది అడిషనల్ డీసీపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed