పొంగి పొర్లుతున్న నల్లవాగు

by Shyam |
పొంగి పొర్లుతున్న నల్లవాగు
X

దిశ, మెదక్: మధ్య తరహా ప్రాజెక్టులలో ఒకటి అయిన సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటితో నిండు కుండలా పొంగిపొర్లుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి పై నుంచి వచ్చే వరద తోడవడంతో అలుగు పై సుమారు ఒక అడుగు పైచిలుకు నీరు కిందకు పొర్లుతోంది.

నల్లవాగు పూర్తి సామర్థ్యం 1,493 అడుగులు కాగా, పూర్తి స్థాయిలో నీరు చేరి అలుగు పొంగడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్లవాగు కుడి కాలువ, ఎడమ కాలువ కలిపి సుమారు 6 వేల ఎకరాలకు నీరు అందనుంది. నల్లవాగు ప్రాజెక్ట్ కింద సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్, కల్టేర్ మండలం, కామారెడ్డి జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల పంటలకు కాలువల ద్వారా నీరు అందిస్తారు.

Advertisement

Next Story

Most Viewed