- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరుగుతున్న ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు!
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది చివరికి నాటికి ఆదాయ పన్ను రిటర్నుల(ఐటీఆర్) గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఐటీ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 27న ఒక్కరోజే 15,49,831 ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని, ఇక, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను దాఖలు ఈ నెల 31 వరకు గడువు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సోమవారం నాటికి మొత్తం 4.67 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఈ మొత్తంలో ఐటీఆర్ 1 2.50 కోట్లకు పైగా ఉండగా, ఐటీఆర్ 4 1.17 కోట్లకు పైగా దాఖలయ్యాయని పేర్కొంది.
ఐటీఆర్ దాఖలుకు ఈ ఏడాది జూలై నాటికి ప్రభుత్వం గడువును నిర్దేశించింది. అయితే, ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్‌లో పలు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడంతో ప్రభుత్వం ఈ నెలాఖరుకు గడువు పొడిగించింది. ఈ క్రమంలో గడువును ఇంకా మూడు రోజుల సమయం ఉన్న కారణంగా పన్ను చెల్లింపుదారులు పెద్ద సంఖ్యలో దాఖలు చేయడం మొదలుపెట్టారు. అయితే, కొత్త ఐటీ వెబ్‌సైట్‌లో ఇంకా సమస్యలు ఉన్నాయని, గడువును మరోసారి పెంచాలని పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రభుత్వం గడువును పెంచేందుకు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.