‘17 కోట్లమంది పేదలకు 5 కిలోల అదనపు రేషన్ అందలేదు’

by Shamantha N |
‘17 కోట్లమంది పేదలకు 5 కిలోల అదనపు రేషన్ అందలేదు’
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం గరీబ్ కళ్యాన్ అన్న యోజనా(పీఎంజీకేఏవై) కింద సుమారు 17 కోట్లమంది అర్హులైన పేదలకు మే నెలకు సంబంధించిన ఐదు కిలోల అదనపు బియ్యం లేదా గోధుమలు ఇంకా అందలేదు. పీఎంజీకేఏవై కింద అర్హులైన 62 కోట్ల మంది పేదలకు (78 శాతం మంది) మాత్రమే మే 28 నాటికి రేషన్‌ పంపిణీ పూర్తయింది. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారి ప్రకటించిన రూ. 1.70కోట్ల ప్యాకేజీలో పీఎంజీకేఏవై కీలకమైన స్కీం. దీని కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలను అందించాలి. అయితే, మే నెలకు సంబంధించి ఇంకా సుమారు 17 కోట్ల మందికి ఈ సహాయం అందనేలేదని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా, శుక్రవారంనాడు ఓ చర్చలో సదరు శాఖా మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు చాలా వరకు ఈ అదనపు ధాన్యాన్ని పేదలకు పంపిణీ చేశాయని, అయితే, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ మాత్రం ఇంకా పంపిణీ చేయాల్సే ఉన్నదని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, నాగాల్యాండ్, ఛత్తీస్‌గడ్‌లు మాత్రమే 100శాతం పంపిణీ చేశాయని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటక, మేఘాలయ, ఒడిషా, రాజస్తాన్‌ సహా పలురాష్ట్రాలు దాదాపు 90శాతం మేరకు ఈ పంపిణీని పూర్తి చేశాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed