మీరు ఇచ్చే వేతనంతో మా ఇల్లు గడవడం కష్టం సార్..

by Shyam |
out souecing job holders
X

దిశ జూబ్లీహిల్స్ : యూసుఫ్ గూడ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఔట్ సోర్సింగ్ ఆయాలు, నెలవారీ వేతనం పెంచడం లేదు అని CITU యూనియన్ ద్వారా ధర్నా చేపట్టారు. 20 సంవత్సరాల నుండి 60 రూపాయల వేతనంతో మొదలైంది. ఇప్పుడు 7 వేల వేతనం ఇస్తున్నారు కానీ దీంతో మాకు ఇల్లు గడవడం చాలా కష్టం అవుతుంది మాకు వేతనం పెంచాలి అంటూ CITU హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ కె.ఈశ్వర్, ఔట్ సోర్సింగ్ ఆయాలు ధర్నా చేపట్టారు. మాకు కనీస వేతనం 18వేలు పెంచాలని అంటూ డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న CITU హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ కె.ఈశ్వర్‌ని అలాగే 30 మంది ఆయాలను అరెస్ట్ చేసి గోశామహల్‌కి తరలించామని ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed