ప్రజలకు సేవ చేయడమే మా కర్తవ్యం..!

దిశ, మెదక్:

రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడమే తమ కర్తవ్యమని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగిలో పలు అభివృద్ది పనులను మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, భూపాల్ రెడ్డిలతో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పీఎంజీఎస్‎వై కింద దుబ్బాక నియోజకవర్గానికి మంజూరైన రోడ్డును దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి నార్సింగి మండలానికి మంజూరు చేయించారని గుర్తు చేశారు. నార్సింగి మండల కేంద్రంగా ఏర్పడటానికి 30 ఏళ్లు పోరాటాలు చేసినా సాధ్యం కాని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీరిందన్నారు. నూతనంగా ఏర్పడిన మండలంలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

Advertisement