- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్రేజీ ఓటీటీలో ‘చంద్రముఖి 2’ విడుదల విషయంలో ట్విస్ట్..

దిశ, సినిమా: ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘చంద్రముఖి 2’ సినిమా ఎట్టకేలకు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఇక టాక్ విషయానికి వస్తే సేమ్ ‘చంద్రముఖి’ తరహాలోనే మూవీని చక్కగా తీర్చిదిద్దారని.. కంగన, లారెన్స్ యాక్టింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాల హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా నెల రోజుల్లోపే ఓటీటీలోకి దింపేస్తున్నారు. దీంతో ఇప్పుడు ‘చంద్రముఖి 2’ ఓటీటీ రిలీజ్ డేట్, రైట్స్ ఆసక్తిగా మారాయి. థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీల్లో చూసే అవకాశం ఎక్కువగా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మూవీ థియేట్రికల్ రన్ పూర్తి అవ్వగానే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. కానీ అంత త్వరగా మాత్రం కాకుండా.. రెండు, మూడు నెలల తర్వాత విడుదల చేయనున్నారట.
- Tags
- chandramukhi 2