ఓటీటీలో ‘టిల్లు స్క్వేర్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల.. ఎన్ని భాషల్లోనంటే?

by Hamsa |   ( Updated:2024-04-22 12:33:17.0  )
ఓటీటీలో ‘టిల్లు స్క్వేర్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన విడుదల.. ఎన్ని భాషల్లోనంటే?
X

దిశ, సినిమా: మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇందులో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడూ లేని విధంగా బోల్డ్‌గా నటించి మెప్పించింది. అలాగే నేహా శెట్టి టిల్లు స్క్వేర్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించింది. అయితే ఈ సినిమా మార్చి 29న థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఇందులోని కామెడీ సీన్స్, సిద్దు డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అలాగే టిల్లు స్క్వేర్ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసును బద్దలు కొట్టింది. దీంతో థియేటర్స్‌లో ఈ సినిమాను చూడని సినీ ప్రియులు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. దీని డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఏప్రిల్ 26 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ వేదికగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story