ఇది కదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. అన్ని కోట్లతో ‘కూలీ’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్లాట్‌ఫామ్(పోస్ట్)

by Kavitha |   ( Updated:2025-03-19 13:07:50.0  )
ఇది కదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. అన్ని కోట్లతో ‘కూలీ’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్లాట్‌ఫామ్(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'కూలీ'(Coolie). యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్​లో రూపొందుతున్న ఆ చిత్రంలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర(Upendra) కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్‌ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌(Ameer Khan) కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అలాగే శ్రుతిహాసన్(Sruthi Haasan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) స్పెషల్ సాంగ్​లో ఆడిపాడనున్నారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్లు మేకర్స్ వెల్లడిస్తూ.. ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ మూవీకు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ‘కూలీ’ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) ఏకంగా రూ.120 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఇన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. రజనీ ఫ్యాన్స్ ఇది కదా సూపర్ స్టార్ రేంజ్ అంటే అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్‌(Anirudh) ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా.. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌(Kalanidhi Maran) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ కంప్లీట్ అవ్వడం వల్ల, మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండనుంది. అయితే విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ, మే 1 రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story