- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫైనల్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. చెప్పిన డేట్ కంటే రెండు రోజులు ఆలస్యంగా

దిశ, వెబ్‌డెస్క్: మాస్‌కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila). డైరెక్టర్ రామ్ నారాయణ్(Ram Narayan) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి లేడీ గెటప్‌లో నటించాడు. ఇక ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్(Leon James) సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి(Sahu Garapati) ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.
అయితే రిలీజ్‌కు ముందే పోస్టర్స్(Posters), టీజర్(Teaser), ట్రైలర్(Trailer)లతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. ఇక భారీ అంచనాల నడుమ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన సుమారు మూడు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో ప్రసారమవుతుంది. నిజానికి ఈ సినిమా మార్చి 7న స్ట్రీమింగ్ కానుండగా.. అలా కాకుండా రెండు రోజులు ఆలస్యంగా అనగా మార్చి 9 నుంచి ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు ఈ సినిమా థియేటర్లలో చూడని వారు చూసేయండి.
Read More..
అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్