Samantha- Rana: ఎనిమిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన రానా, సమంత మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

by Hamsa |   ( Updated:2024-08-21 07:47:46.0  )
Samantha- Rana: ఎనిమిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన  రానా, సమంత మూవీ.. ఎందులో చూడొచ్చంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రానా దగ్గుబాటి మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి తెలుగులో సినిమా చేయనప్పటికీ కన్నడలో చేశారు. దీనిని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించగా.. ఇందులో సమంత, ఆర్య, బాబీ సింహ, రానా, పార్వతి తిరువొతు, శ్రీ దివ్య కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాను మలయాళం సూపర్ హిట్ మూవీ బెంగళూరు డేస్‌ రిమేక్‌గా తెరకెక్కించారు. దీనికి బెంగళూరు నాట్కళ్ పేరుతో 2016లో థియేటర్స్‌లో విడుదల చేశారు. సినిమా మొత్తం నలుగురు స్నేహితుల చుట్టే తిరుగుతుంది. స్నేహం, ప్రేమ, పెళ్లి, కెరీర్‌కు సంబంధించి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది ఎంతో ఆసక్తికరంగా చూపించారు.

అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్’ను సొంతం చేసుకుంది. దీంతో దీనిని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్ కానీ విడుదల కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు బెంగళూరు డేస్ రీమేక్ మూవీ డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. విడుదలైన ఎనిమిదేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో సమంత, రానా సీన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నట్లు సమాచారం. ఇక తమిళ వర్షన్ మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీలోకి రావడంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

(Video Link Credits totelugufilmnagar Instagram Channel)

Advertisement

Next Story