- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలోకి ‘పుష్ప 2’.. క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన మేకర్స్.. (పోస్ట్)
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’(Pushpa-2). డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల అయి 16 రోజులు కావొస్తున్నా కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. అయితే గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని ఓ పుకారు నెట్టింట షికారు చేస్తోంది.
ఇందులో భాగంగా ఈ మూవీ జనవరి 9 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని వార్తను బాగా స్ప్రెడ్ చేశారు. అయితే తాజాగా వీటిపై చిత్రబృదం స్పందించింది. అవన్ని రూమర్లే అని కొట్టిపారేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ‘ పుష్ప-2 మూవీ ఓటీటీకి సంబంధించిన పుకార్లు వస్తున్నాయి. ఇప్పట్లో ఆ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. విడుదలైన 56 రోజుల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. అప్పటి వరకు పుష్ప-2 వైల్డ్ ఫైర్‌ను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి’ అని ఎక్స్ వేదికగా చిత్రబృదం తెలిపింది.