Priyanka Chopra: ఓటీటీలోకి రాబోతున్న ఆస్కార్ నామినేటెడ్ ‘అనూజ’.. ప్రియాంక చోప్రా మూవీ ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే? (పోస్ట్)

by Hamsa |   ( Updated:2025-01-30 09:19:22.0  )
Priyanka Chopra: ఓటీటీలోకి రాబోతున్న ఆస్కార్ నామినేటెడ్ ‘అనూజ’.. ప్రియాంక చోప్రా మూవీ ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. హాలీవుడ్‌ ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ తన టాలెంట్‌తో అందరిచేత ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల ప్రియాంక చోప్రా నిర్మించిన ‘అనూజ’(Anuja) మూవీ 2025 97వ ఆస్కార్‌ నామినేషన్స్‌లో సెలెక్ట్ అయింది. ఈ సినిమా షార్ట్ ఫిలిం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా.. కేవలం ఐదు చిత్రాలు మాత్రమే నిలిచాయి. ఇక మన దేశం నుంచి రేసులో ‘అనూజ’ ఉండటం విశేషం. దీనికి ఆడమ్ జే గ్రేవ్స్(Adam Jay Graves) దర్శకత్వం వహించగా.. గునీత్ మెంగా(Guneet Monga), ప్రియాంక చోప్రా నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్‌కు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘అనూజ’ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఫిబ్రవరి 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, ప్రస్తుతం ప్రియాంక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సరసన ‘SSMB-29’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read..

అతను ప్రతిరోజు నా దగ్గరకి వచ్చి అలా చేసేవాడు .. ఎప్పటికీ తనను వదులుకోను.. సమంత షాకింగ్ కామెంట్స్


Next Story

Most Viewed