నరేష్- పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

by Hamsa |   ( Updated:2023-06-20 09:18:18.0  )
నరేష్- పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ కలిసి నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ సినిమాకు MS రాజు దర్శకత్వం వహించారు. దీనిని నరేష్ నిజజీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. దీనిని విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి నరేష్ దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మే 26న గ్రాండ్‌గా విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. జూన్ 23న ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Advertisement

Next Story