Kanguva: ఓటీటీలోకి ‘కంగువ’.. ఇంతలో అమెజాన్ ప్రైమ్‌కు బిగ్ షాక్!

by sudharani |   ( Updated:2024-12-01 16:34:59.0  )
Kanguva: ఓటీటీలోకి ‘కంగువ’.. ఇంతలో అమెజాన్ ప్రైమ్‌కు బిగ్ షాక్!
X

దిశ, సినిమా: తమిళ స్టార్ సూర్య (Tamil Star Surya) నటించిన తాజా చిత్రం ‘కంగువా’ (Kanguva). ప్రముఖ డైరెక్టర్ శివ (Director Shiva) దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై కేవలం మిక్సిడ్ టాక్‌కే పరిమితం అయింది. దీంతో దాదాపు 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. అంటే బడ్జెట్‌లో సగం కూడా రాబట్టనట్లు తెలుస్తుండగా.. ప్రజెంట్ మరో షాకింగ్ ఇష్యూ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అయితే.. ‘కంగువా’ రిలీజ్‌కు ముందు సినిమాపై సూపర్ బజ్ (Super Buzz) క్రియేట్ కాగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక రిలీజ్ అనంతరం రిజల్ట్ తెలియంతో.. సినిమా విడుదలైన నెల రోజులకే అంటే డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొస్తు్న్నట్లు టాక్. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్‌కు మరో బిగ్ షాక్ (Big Shock) తగిలినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవ్వనున్న క్రమంలో.. ఇప్పుడు ఆన్ లైన్‌లో ‘కంగువా’ హెచ్ డీ క్వాలిటీ (HD Quality) ప్రింట్ లీక్ అయింది. దీంతో డిజాస్టర్ (disaster) అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు హెచ్ డీ ప్రింట్ కూడా లీక్ కావడంతో.. ఓటీటీ లో కూడా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌కు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. చూడాలి మరి.. ఈ చిత్రాన్ని అనుకున్న దానికంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

Read More...

Unstoppable Talk Show: అన్‌స్టాప‌బుల్ షోకు విచ్చేసిన శ్రీలీల-న‌వీన్ పొలిశెట్టి.. తనలోని మరో కోణాన్ని బయటపెట్ట...


Advertisement

Next Story

Most Viewed