వ్యాయామ టీచర్లకు ఓరియంటేషన్ శిక్షణ..!

by  |
వ్యాయామ టీచర్లకు ఓరియంటేషన్ శిక్షణ..!
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట, మెదక్ జిల్లాలో పనిచేస్తున్న వ్యాయామ టీచర్లందరికీ ఈనెల 14వ తేదీ నుంచి పది రోజులపాటు ఆన్‎లైన్ ద్వారా శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ రవికాంత్ రావు తెలిపారు. వ్యాయామ విద్యలో భాగంగా పనిచేస్తున్న టీచర్లకు పలు రకాల ఆటలు, యోగ, ఆరోగ్య, విద్య, ప్రథమ చికిత్స వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఈ శిక్షణలో పాల్గొనాలని విద్యాధికారి రవికాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. 14వ తేదీ ఉదయం 10.30-12.00 గంటల వరకు క్లాసులు ఉండనున్నట్లు.. 15వ తేదీ ఉదయం 7-8 గంటల వరకు యోగా శిక్షణ ఉండనున్నట్టు వెల్లడించారు, Zoom యాప్ ద్వారా శిక్షణ ఉండనున్నట్లు దీనికి సంబంధించిన ఐడీ పాస్‎వర్డ్‎లను పంపించడం జరుగుతోందని రవికాంత్ తెలిపారు.


Next Story

Most Viewed