ప్రధాని చర్చంతా ఆట వస్తువులపైనే : రాహుల్

by Anukaran |   ( Updated:2020-08-30 05:14:00.0  )
ప్రధాని చర్చంతా ఆట వస్తువులపైనే : రాహుల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రేడియో ప్రోగ్రామ్ ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రసంగంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు జేఈఈ, నీట్ పరీక్షలపై చర్చించాలని కోరుతుంటే ప్రధాని మాత్రం, ఆట వస్తువులపై చర్చలు జరిపారంటూ విమర్శలు చేశారు.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారని తెలిపారు. ఈ విషయంపై ప్రధాని మౌనం వీడి పరీక్షలపై స్పందించాలని రాహుల్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed