ఆర్థిక స‌ర్వేతో ఉపాధి అవ‌కాశాలు

by Shyam |
ఆర్థిక స‌ర్వేతో ఉపాధి అవ‌కాశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప‌దో త‌ర‌గ‌తి కనీస విద్యార్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న ఏడో ఆర్థిక సర్వేలో పాల్గొనే అవ‌కాశం హైద‌రాబాద్‌లోని యువ‌తకు ద‌క్కనుంది. కనీస‌ విద్యార్హతతోనే ఎన్యుమరేటర్లుగా అవకాశం సొంతం చేసుకునే ఛాన్స్ తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) డిజిథాన్ సంస్థ అంద‌జేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 52% పూర్త‌యిన స‌ర్వేను గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల గురువారం ప్రారంభించారు. ఏడో ఆర్థిక స‌ర్వేలో వ‌న్ మిలియ‌న్ డిజిట‌ల్ స‌ర్వేలు చేయ‌డం ల‌క్ష్యంగా టీటా నిర్దేశించుకుంది. దీని కోసం ఐదు వేల మందికి ఎన్యుమ‌రేట‌ర్లుగా అవ‌కాశం క‌ల్పిస్తోంది. తెలంగాణ ఐటీ అసోసియేష‌న్ అనుబంధ సంస్థ డిజిథాన్, సీఎస్‌సీ సంయుక్తంగా ఈ స‌ర్వేను నిర్వ‌హిస్తున్నాయి.

గ్రేట‌ర్ ప‌రిధిలో 573ఇన్వెస్టిగేట‌ర్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు 10మంది వ‌ర‌కు ఎన్యుమ‌రేట‌ర్ల‌ అవ‌స‌రం ఉంది. ఈ అవ‌కాశాల్లో ఉపాధి పొందాల‌ని భావించే వారు టెన్త్ ఉత్తీర్ణులై, స్మార్ట్ ఫోన్ వాడకంలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. bit.ly/censussurvey త‌మ వివ‌రాలు న‌మోదు చేసుకొని ఎన్యుమరేటర్ అవకాశం కోసం ప‌రీక్ష రాయ‌వ‌ల‌సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణుల‌కు ప‌త్రాలు, గుర్తింపు కార్డులు పొంద‌నున్నారు. ఈ ఆర్థిక స‌ర్వేలో పాలు పంచుకున్న వారు రాబోయే కాలంలో ప్ర‌తి డిజిటల్ స‌ర్వేలో అవ‌కాశం పొంద‌గ‌ల‌రు. డిజిటల్ సర్వేను సీఎస్‌సీ హైదరాబాద్ డిస్ట్రిక్ మేనేజ‌ర్ సౌమ్య ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఆఫీసు వేళల్లో 6300368705/ 8374865629 /8123123434 నంబర్లను సంప్రదించవచ్చు.

Advertisement

Next Story