- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు, రేపు చేర్పులు, మార్పులకు అవకాశం
దిశ, తెలంగాణ బ్యూరో: ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు ఈనెల 6,7వ తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అదే విధంగా ఈ నెల 27,28 తేదీల్లో కూడా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తామని ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం స్పెషల్ సమ్మరీ రివిజన్- 2022 విడుదల చేసిన ఓటరు జాబితా పై ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించేందుకు శని, ఆదివారాల్లో క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబితాతో అందుబాటులో ఉండి దరఖాస్తు స్వీకరిస్తారని జీహెచ్ఎంసీ తెలిపింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా 18 ఏళ్లు నిండినవారు నూతన ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఓటరు జాబితాలో నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగింపు, డబుల్ ఓటరుగా నమోదు అయినవారు ఫారం-7 ద్వారా, ఓటరు జాబితాలో తప్పులు సవరణ కోసం ఫారం -8 ద్వారా, ఒకే నియోజకవర్గంలో ఇతర అడ్రస్ కు మార్పునకు ఫారం- 8ఏ ద్వారా గాని www.ceotelangana.nic.in లేదా www.nvsp.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
- Tags
- list