- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ పోయిందని పోల్ ఎక్కాడో లేదో.. అంతలోనే!
దిశ, పటాన్ చెరు : కరెంట్ పోయిందని పోల్ ఎక్కగానే పవర్ రావడంతో ప్రమాదవశాత్తు వ్యక్తి మరణించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్డారం గ్రామంలోని ఓ క్రషర్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రామానాయుడు కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన భగత్ సింగ్ ధ్రువ (30) ఏడేళ్ల కిందట బతుకుదెరువు కోసం జిల్లాకు వచ్చి సాయి సూపర్ సౌండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టోన్ క్రషర్ ప్లాంట్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.45 గంటలకు విధులు నిర్వహిస్తుండగా కరెంటు పోయింది.
చెక్ చేసేందుకు పోల్ ఎక్కి, ఫీజ్ తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు. ఆ సమయంలో తల వెనక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని ఇస్నాపూర్‌లోని కాకతీయ ఆసుపత్రికి, అక్కడ నుండి మాక్స్ కేర్ ఆస్పత్రికి, మరల అక్కడ నుంచి పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. మృతుని అన్న రాహుల్ ధ్రువ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.