లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు

by Sridhar Babu |   ( Updated:2020-04-02 11:28:40.0  )
లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు
X

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ నివారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది. వైరస్‎తో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అయినా, కొంతమంది మాత్రం తామకేమి పట్టనట్లు.. లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కనీసం సోషల్ డిస్టెన్స్ సైతం పాటించకుండా ఒకే గదిలో పదుల సంఖ్యల్లో చిన్నారులను పొగుచేస్తున్నారు. వివరాళ్లోకి వెళితే.. రంగారెడ్ది జిల్లాలోని హయత్ నగర్ మండలం పసుమాములలో ఓ ప్రార్థన మందిరంలో నిర్వహకులు కార్యక్రమాలు చేపడుతున్నారు. లాక్ డౌన్‌కు వ్యతిరేకంగా వందల సంఖ్యలో చిన్న పిల్లలను పొగుచేసి ఓ వర్గం పెద్దలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న పిల్లలకి కరోనా సోకితే బాధ్యత ఎవరిది అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

tag: Operations, against, lockdown, Masjid, hayathnagar



Next Story