ఉస్మానియాలో ఆన్‌లైన్ మూల్యాకనం..

దిశ, వెబ్‌డెస్క్ :

ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ మూల్యాంకన విధానాన్ని తీసుకురానున్నట్లు అకాడమిక్ కౌన్సిల్ ప్రకటించింది. ఇందులో భాగంగా పరీక్షల అనంతరం జవాబు పత్రాలను ఆన్ లైన్ లో అధ్యాపకులకు పంపిస్తారు.

దీంతో వారు ఎక్కడినుంచైనా మూల్యాంకనం చేసే వీలును కల్పించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో సకాలంలో ఫలితాలను విడుదల చేయడానికి కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement