జూరాలకు కొనసాగుతున్న వరద 

by Shyam |
జూరాలకు కొనసాగుతున్న వరద 
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లాలో వరప్రదాయని జూరాలకు వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు కావాల్సిన మేర నీటిని నిల్వ చేస్తూ మిగితా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 54,000 క్యూసెక్కులు ఉండగా 2 గేట్లను ఎత్తి 48,136 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుత నీట్టి నిల్వ 9.214 టీఎంసీలు ఉన్నాయి. పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.లకు ప్రస్తుత నీటి మట్టం: 318.300 మీ.లుగా ఉంది.

ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్స్ లో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్స్ లో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

Advertisement

Next Story