- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాజెక్టులకు జలకళ
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. గోదావరి నదిలో వరద పెరిగింది. కృష్ణాలో ఎగువన కొంత వరద తగ్గినా ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ఆల్మట్టికి 24,707 క్యూసెక్కులు వస్తుండగా 46,130 క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ ప్రాజెక్టులో 92.45 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయానికి 46,045 క్యూసెక్కులు వస్తుండగా 45,995 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 37టీఎంసీలు కాగా 35.06 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు వరద పెరిగింది. జూరాలకు గురువారం రాత్రి వరకు 80 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా దిగువకు 1,11,501 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్వ 9 టీఎంసీలకు చేరింది. 11 స్పిల్ వే గేట్ల నుంచి 73వేలు, పవర్ హౌస్ ద్వారా 33 వేలు వదులుతున్నారు. కాల్వలకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. మొత్తం ఔట్ ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు 38,825 క్యూసెక్కులు వస్తున్నాయి. గోదావరి ప్రాజెక్టుకు వరద చేరుతుండటంతో బాసర దగ్గర వరద పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం వరకు ఎస్సారెస్పీకి వరద పెరిగింది. 4వేల క్యూసెక్కులు వస్తున్నాయి. కాల్వలకు 1586 క్యూసెక్కులు వదులుతున్నారు. మిడ్ మానేరుకు 1200 క్యూసెక్కులు వస్తుండగా 5945 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎల్ఎండీలో 6 వేల క్యూసెక్కులు చేరుతుండగా 3465 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. కడెం ప్రాజెక్టుకు 3021 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లికి 3572 క్యూసెక్కుల ఇన్ ఫ్లోఉంది. గోదావరి డెల్టాలో 33 వేల ఇన్ ఫ్లో, 35 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. గోదావరిలో పెరూరు దగ్గర 56 వేల క్యూసెక్కులు నమోదవుతున్నాయి.