- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓఎన్‌జీసీ నికర లాభంలో 85 శాతం క్షీణత!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 84.7 శాతం క్షీణించి రూ. 1,090 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 7,120 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో ఓఎన్‌జీసీ కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 42.9 శాతం తగ్గి రూ. 62,496 కోట్లకు చేరుకుంది.
గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 1,09,546 కోట్లుగా నమోదైంది. కొవిడ్-19 ప్రభావం అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో ప్రతికూలత ఉండటం కారణంగా ఆదాయం, లాభాలు ప్రభావితమైనట్టు కంపెనీ వెల్లడించింది. లాక్‌డౌన్ సమయంలో చమురు (Oil), గ్యాస్ (Gas), పెట్రోలియం (Petroleum) ఉత్పత్తులను ప్రభుత్వం అత్యవసరమైన సేవలుగా ప్రకటించింది. తదనుగుణంగా కంపెనీ వినియోగదారులకు ఉత్పత్తులను సరఫరా చేసిందని కంపెనీ పేర్కొంది.