- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కట్నం కోసం వేధించిన భర్త.. కటకటాల్లోకి నెట్టిన భార్య
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల అమ్రాబాద్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి వరకట్న వేధింపు కేసులో అచ్చంపేట జూనియర్ సివిల్ జడ్జి చైతన్య కారాగార శిక్షను విధించిందని అమ్రాబాద్ ఎస్ ఐ వెంకటయ్య తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2016 లో అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళ తన భర్త అచ్చంపేట మండలం ఐనూలు మా గాని శ్రీహరితో వివాహం జరిగిందని భర్త తన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నారని 2016లో అమ్రాబాద్ పీఎస్ నందు ఫిర్యాదు చేయగా అప్పటి అమ్రాబాద్ ఎస్ ఐ జహంగీర్ యాదవ్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు ఫైల్ చేసిశారని తెలిపారు. తరువాత కోర్టులో ఏపీపీ రఘునాథ్ రెడ్డి, డిఫెన్స్ అడ్వకేట్ వాదోపవాదాలు విన్న తర్వాత అచ్చంపేట జూనియర్ సివిల్ జడ్జి చైతన్య శ్రీహరికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించిందని, తదుపరి శిక్ష పడిన వ్యక్తిని జైలుకు తరలించామని ఎస్ఐ తెలిపారు.