ఈదురు గాలులు.. పిడుగుపాట్లు.. ఒకరు మృతి

by Shyam |
ఈదురు గాలులు.. పిడుగుపాట్లు.. ఒకరు మృతి
X

దిశ మక్తల్/ వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు అమ్మకం కోసం సిద్ధం చేసిన వరి ధాన్యం కొన్నిచోట్ల వర్షానికి కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల తడిసిముద్దయింది. అమ్మకానికి వచ్చిన మామిడి నేలరాలింది. ఆకస్మికంగా కురిసిన వర్షంతో ప్రజల జనజీవన స్రవంతికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. భూత్పుర్ మండలం కొత్తతండాకు చెందిన మహిళా రైతు చిట్టి(27) పిడుగుపాటుకు గురై తన వ్యవసాయ పొలంలో మృతి చెందింది.

ఆమెకు సమీపంలోనే ఉన్న గోవు కూడా మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. ఇక గట్టు మండల కేంద్రానికి చెందిన సవారీ(16) అనే బాలుడు గొర్రెలను మేపడం కోసం తమ కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక ప్రాంతానికి వెళ్లాడు. అక్కడే పిడుగుపాటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈదురు గాలులు పెద్దఎత్తున వీచడంతో.. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలోని పలు మండలాలలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Next Story

Most Viewed