ఎదురెదురుగా కార్లు ఢీ… ఒకరు మృతి

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కురువగూడ-అంతారం జాతీయ లింక్ రోడ్డుపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాళ్లోకి వెళితే… షాబాద్ మండల కేంద్రానికి చెందిన రాజేష్ రెడ్డి, పబ్బు రాజు అనే వ్యక్తితో కలిసి కారులో షాద్‌నగర్ వెళ్తుండగా, మరో కారు షాద్‌నగర్ నుంచి ఎదరుగా వస్తూ, అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న డివైడర్‌కు తగిలి, ఎదురుగా వస్తున్న రాజేశ్ కారును ఢీ కొట్టింది. దీంతో రాజేశ్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. ఆయనతో పాటు కారులో ఉన్న పబ్బు రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Advertisement