- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాత రుద్రారంలో కరోనాతో ఒకరి మృతి
by Sumithra |

X
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. మండలాల్లోని ఏదో ఒక గ్రామంలో కరోనాతో మృతి చెందుతున్న వార్తలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మల్హర్ మండలంలోని పాత రుద్రారం గ్రామంలో ఓ మహిళ కరోనాతో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం మరణించింది. భర్త సైతం కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుండడంతో మృతురాలికి దహన సంస్కారాలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు.
దీంతో సంజీవిని సేవా సమితి ట్రస్ట్ వారికి సమాచారం అందడంతో మృతురాలికి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. ఇదిలా ఉంటే మరో కుటుంబంలో భార్యాభర్తలిద్దరు కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం మహాముత్తారం మండలంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. రోజురోజుకు ఈ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో మారుమూల ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Next Story