కరోనాతో ఒకరు మృతి.. మరొకరికి క్వారంటైన్

by vinod kumar |
కరోనాతో ఒకరు మృతి.. మరొకరికి క్వారంటైన్
X

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరో వ్యక్తి కరోనా బారిన పడి మృత్యువాత పడ్డాడు. అలాగే గద్వాల్ మండలంకు చెందిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండల కేంద్రానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందారు. అదే విధంగా గద్వాల మండలం గోన్పాడు గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో పోలీసులు.. బాధితుడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తి హైదరాబాదులో ఈఎస్ఐ హాస్పిటల్ లో పని చేస్తాడని, మూడు రోజుల క్రితం అతను గ్రామానికి వచ్చి వెళ్లాడని, ఈ నేపథ్యంలో అతడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ ఉండాల్సిందిగా సూచించారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed