- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
జగిత్యాలలో నెత్తురోడిన రహదారి.. కారులో మంటలు!

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామ శివారులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకివెళితే.. కోరుట్లలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కారులో వస్తుండగా, ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, సమీర్ అనే బాలుడు కారు సీట్ మధ్యలో ఇరుక్కపోయాడు.
వెంటనే అప్రమత్తమైన స్థానికుల సాయంతో కారు పాట్స్ తొలగించి అతన్ని క్షేమంగా బయటకు తీశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, కారులో ఉన్న సద్దాం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.