కామారెడ్డిలో దారుణం

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డి ప్రభుత్వస్పత్రి వద్ద ఆదివారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, అతను కరోనాతో మృతిచెంది ఉంటాడని ఎవరూ కూడా ఆ వ్యక్తి మృతదేహం వద్దకు వెళ్లడంలేదు. గంటలకొద్ది ఆ వ్యక్తి మృతదేహం అక్కడే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆరా చేస్తున్నారు.

Advertisement