ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి

by srinivas |   ( Updated:2020-08-07 22:13:25.0  )
ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కారు అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చీరాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed