- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగానే ఉంది : ఆర్‌బీఐ గవర్నర్
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రస్తుతం కొనసాగుతున్న కొవిడ్-19 సంక్షోభంలోనూ భారత బ్యాంకింగ్ వ్యవస్థ (Indian banking sector) పటిష్టంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రేట్ల తగ్గింపుతో పాటు, ఇతర విధాన చర్యల్లో తమ వద్ద అస్త్రాలున్నాయని ఓ ఇంటర్వ్యూలో దాస్ పేర్కొన్నారు.
మితిమీరిన రక్షణాత్మక ధోరణి వల్ల బ్యాంకులు ఎక్కువ నష్టపోతాయని తెలిపారు. కరోనా సంక్షోభం (Covid crises) తర్వాత సెంట్రల్ బ్యాంకు రేట్ల (Central bank rates)లో మార్పు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఆర్థిక రంగం సాధారణ స్థితికి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సమీప భవిష్యత్తులో సెంట్రల్ బ్యాంకు తగిన చర్యలను నిలిపేస్తుందని భావించవద్దన్నారు. కొవిడ్-19, ఇతర అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం (Inflation), వృద్ధి(Growth) పై ఆర్‌బీఐ తన అంచనాలను వెల్లడిస్తుందన్నారు. ఈ నెల 4న జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల వడ్డీ రేట్లను యథాస్థితిలోనే కొనసాగించాలని శక్తికాంత దాస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.