ఫ్లాష్ ఫ్లాష్ : దేశంలో మరోసారి హ్యాకింగ్ కలకలం..

by Anukaran |   ( Updated:2021-07-18 21:56:54.0  )
pegasus
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మరోసారి హ్యాకింగ్ కలకలం సృష్టించింది. ఇజ్రాయిల్ తయారీ ‘పెగాసస్ స్పైవేర్’ ద్వారా ప్రముఖుల ఫోన్లు, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేశారని ‘ది వైర్ వార్తా సంస్థ’ కథనం ప్రచురించింది. అయితే, ‘పెగాసస్ అనే స్పైవేర్’ను దేశభద్రత కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఇజ్రాయిల్ నుంచి పొందింది. దీని ఆధారంగానే హ్యాకర్లు ప్రముఖులను టార్గెట్ చేశారని ది వైర్ తన కథనంలో పేర్కొంది.

హ్యాకర్ల దాడికి గురైన వారిలో ప్రధాని కేబినెట్‌లోని ఇద్దరు కేంద్రమంత్రులు, ముగ్గురు కీలక విపక్ష నేతలు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, కొందరు వ్యాపారులు, భద్రతా సంస్థల ప్రస్తుత, మాజీ అధికారులు, 40 మంది జర్నలిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లీక్ అయిన ఓ డేటా బేస్ వీరి ఫోన్ నెంబర్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అందులో తమ పాత్ర లేదని, అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ ఖండించింది. అంతేకాకుండా, వ్యక్తిగత సమాచారం భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా వ్యక్తిగత సమాచారం దోపిడికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed