- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజృంభిస్తోన్న ‘ఒమిక్రాన్’.. మహారాష్ట్రలో ఒకేరోజు 8 కేసులు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఒమిక్రాన్ కొవిడ్ కొత్త వేరియంట్ క్రమంగా విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా విదేశాల నుంచి దేశంలో అడుగుపెట్టిన వారిలో కొందరిలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మొదట బెంగళూరులో రెండు కేసులు నమోదవ్వగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 12 కు చేరింది.
ఇందులో గుజరాత్, ఢిల్లీలో ఒకటేసి చొప్పున కొవిడ్ కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో ఒకే రోజులో ఏకంగా 8 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో దేశంలోని ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. విదేశాల నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాలని, ఎక్కడైతే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయో ఆయా దేశాలకు విమాన సర్వీసులును నిలిపివేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.