- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోవిడ్ రూల్స్ పాటించకుంటే బహిష్కరణే
దిశ, స్పోర్ట్స్: ఒలింపిక్స్ 2020 మరో ఐదు వారాల్లో టోక్యో వేదికగా ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంకా కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్ నిర్వాహక కమిటీ రూల్ బుక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే పలుమార్లు సవరణలు చేసిన ఈ రూల్ బుక్ చివరి వెర్షన్‌ను మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ విడుదల చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతీ అథ్లెట్, కోచ్, మ్యాచ్ అఫీషియల్స్ ఈ ‘ప్లే బుక్’లోని నియమాలను పాటించాలి. ముఖ్యంగా కోవిడ్-19కు సంబంధించి పొందు పరిచిన నిబంధనలు కనుక పాటించకుంటే వారిని వెంటనే జపాన్ నుంచి బహిష్కరిస్తారు. జపాన్ అథ్లెట్లు అయితే వారిని ఒలింపిక్స్‌కు అనర్హులుగా ప్రకటిస్తారు. వీటితో పాటు జరిమానాలు కూడా విధిస్తారని ఆ రూల్ బుక్‌లో పేర్కొన్నారు.
మాస్కులు తప్పకుండా ధరించాలని, ఒలింపిక్ విలేజ్‌లో గుమి కూడటం, కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంపై నిషేధిస్తూ నిబంధనలు రూపొందించారు. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇక ఒలింపిక్స్ కోసం పని చేసే వలంటీర్లు, అధికారులు, ఉద్యోగులు, మీడియా, స్పాన్సర్లకు చెందిన ప్రతినిధులు, కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేకంగా రూల్ బుక్‌ను విడుదల చేయనున్నట్లు ఐవోఏ స్పష్టం చేసింది.