నిద్రిస్తూ వరదలో పడి వృద్ధురాలు మృతి

by Shyam |   ( Updated:2020-10-14 12:22:31.0  )
నిద్రిస్తూ వరదలో పడి వృద్ధురాలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కురిసిన అతి భారీ వర్షంతో సికింద్రాబాద్‌లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. అల్వాల్‌లోని ఓ ఇంట్లోకి బుధవారం భారీగా వరద నీరు చేరుకోగా.. బయటకు రాలేని ఓ వృద్ధురాలు ఇంట్లోనే ఉంది. ఇదే క్రమంలో పొద్దటి నుంచి మంచంపైనే నిద్రిస్తోన్న వృద్ధురాలు వరద నీటిలో పడి ప్రాణాలు కోల్పోయింది. వరదను తొలగించే క్రమంలో ఇంట్లోకి వెళ్లిన అధికారులు, స్థానికులు వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story